🕉️ శ్రీ దుర్గాయై నమః 🕉️
సంస్కారవేదిక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు ఇంటి నుండే పాల్గొనే అవకాశం కల్పిస్తూ, చండీ పారాయణం (దుర్గా సప్తశతి) సేవను ప్రారంభిస్తున్నాము.
సురధుడు అనే రాజుకి సమాధి అనే వైశ్యుడికి మేధా మహర్షి చెప్పినటువంటి చండీ పర దేవతా యెక్క పురాణ గాథ అమ్మవారు మహిషాసురుడు దుమ్రాలోచనుడు రక్త బీజుడు చండ ముండులు శంభుని శుంభులు అనే రాక్షసులని ఎలా సంహరించింది అలాగే దేవతలని ప్రజలని ఎలా కాపాడింది అనే పురాణ చరితం చెప్పడం జరిగింది ఆ పురాణం వినడంవలేనే అమ్మవారు వారి ముగ్గురికి అనేకమైనటువంటి వరాలను ప్రసాదిస్తుంది. దేవీ మాహాత్మ్యం పారాయణ చేయడం వలన మన చుట్టూరా ఉన్న మనుషులలో ఉండే రాక్షస గుణాలనుండి మనల్ని రక్షిస్తుంది. ఇటువంటి మహత్తరమైన దేవీ మహాత్మ్యం విన్న రాజుకి వైశ్యునికీ అలాగే చెప్పినటువంటి ఋషికి కూడా వరాలను కురిపించింది అమ్మవారు
అటువంటి ఈ మహత్తరమైన దేవి మహాత్మ్యం ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి ఉండే సమస్త బాధలు తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఈ అమ్మవారి మహత్యాన్ని 365 రోజులలో ఎప్పుడైనా పారాయణ చెయ్యవచ్చు

